నేను చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నా! 2024 బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా కామెంట్

2 Feb, 2024 14:34 IST|Sakshi

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ 2024పై ట్వీట్ చేశారు.

గత కొంతకాలంగా బడ్జెట్ అనగానే భారీ అంచనాలు పెట్టుకుంటూ.. బడ్జెట్ చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటారు. ప్రతిసారీ బడ్జెట్‌లో పెద్ద పథకాలు, విధానపరమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబాల బడ్జెట్ మాదిరిగానే కేంద్ర బడ్జెట్ రాబడి, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రకటించడం జరుగుతుంది. 

అభివృద్ధి దిశగా చేసే ప్రకటనలకు బడ్జెట్ మాత్రమే సందర్భంగా కాదు. ఎందుకంటే.. సంవత్సరంలో ఎప్పుడైనా సందర్భానుసారంగా  అవసరమైన ప్రకటనలు చేసుకోవచ్చు. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానికి బడ్జెట్ ఒక అవకాశం కల్పిస్తుంది. నేను ఎప్పటినుంచో ఇదే విషయాన్ని చెబుతున్నానంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

2024 మధ్యంతర బడ్జెట్ తనకు ఎంతగానో నచ్చిందని, తక్కువ సమయంలో ఎక్కువ ప్రకటనలు చేయడాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్శించే పథకాలు ఏవీ లేకపోవడం హర్శించదగ్గ విషయమని కొనియాడారు.

ఇదీ చదవండి: పరుగులు పెడుతున్న పసిడి, పడిలేస్తున్న వెండి - నేటి ధరలు ఇవే..

ట్యాక్స్, డ్యూటీస్ వంటి వాటిలో మార్పులు కనిపించలేదు. వ్యాపారులు ఇలాంటి స్థిరత్వాన్ని కోరుకుంటారని వెల్లడించారు. ట్యాక్స్-జీడీపీ నిష్ఫత్తి అధికంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని, అవసరమైన సందర్భాల్లో నిధుల లభ్యతను కూడా పెంచుతుందని అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు