కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే

8 Apr, 2022 19:12 IST|Sakshi

ఇండియన్‌ రోడ్లపై హల్‌చల్‌ చేస్తోన్న సెల్టోస్‌, సొనెట్‌ మోడల్‌ కార్లకు కియా సంస్థ మెరుగులద్దింది. సరికొత్త ఫీచర్లు జోడించి  రిఫ్రెషెడ్‌ వెర్షన్‌ పేరుతో మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. అనతి కాలంలోనే కియా సంస్థ ఇండియన్‌ మార్కెట్‌లో పాగా వేయగలిగింది. ముఖ్యంగా కియా సంస్థ నుంచి వచ్చిన సెల్టోస్‌, సొనేటా మోడళ్లు ఇక్కడి వారికి బాగా నచ్చాయి.

గడిచిన మూడేళ్లలో ఇండియాలో బాగా సక్సెస్‌ అయిన మోడళ్లలో సెల్టోస్‌ ఒకటి. అమ్మకాల్లో ఈ కారు రికార్డు సృష్టిస్తోంది. వెయింటింగ్‌ పీరియడ్‌ కొనసాగుతోంది.  తాజాగా రీఫ్రెష్‌ చేసిన తర్వాత సెల్టోస్‌లో కొత్తగా 13 ఫీచర్లు, సొనెట్‌లో అయితే 9 రకాల మార్పులు చేసినట్టు కియా పేర్కొంది.

కియా సంస్థ సెల్టోస్‌, సొనెట్‌ కార్లలో చేసిన కీలక మార్పుల్లో ఎంట్రీ లెవల్‌ హై ఎండ్‌ అనే తేడా లేకుండా అన్ని వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగ్స్‌ అందించనుంది. కియా కనెక్ట్‌ యాప్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది. డీజిల్‌ వెర్షన్‌ కార్లలో కూడా ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీని పరిచయం చేసింది. 

కియాలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ మోడలైన సెల్టోస్‌ ప్రారంభం ధర రూ.10.19 లక్షల దగ్గర మొదలవుతోంది. సోనెట్‌ ప్రారంభ ధర రూ.7.15 లక్షలుగా ఉంది.  ఇప్పటి వరకు 2.67 లక్షల సెల్టోస్‌ , 1.25 లక్షల సొనెట్‌ కార్లు ఇండియాలో అమ​​‍్ముడయ్యాయి.

చదవండి: Kia Motors: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..!

మరిన్ని వార్తలు