ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!

10 Nov, 2023 16:24 IST|Sakshi

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్‌ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు వడ్డీని పొందారు. ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న నిల్వలపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. 

ఈపీఎఓ ఖాతాలో వడ్డీ జమైందో లేదో అని తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్‌ఓ ​​వెబ్‌సైట్ లేదా ఉమాంగ్‌ యాప్ ద్వారా వారి పాస్‌బుక్‌ను ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు.  

ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో ఎలా చెక్‌ చేయాలంటే?

https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వండి 

హోమ్‌పేజీలో 'సర్వీస్‌' పై క్లిక్ చేసి, 'ఫర్‌ ఎంప్లాయిస్‌' అనే ఆప్షన్‌ని ఎంచుకోండి 

ఆపై 'మెంబర్‌ పాస్‌బుక్‌' లింక్‌పై క్లిక్ చేయండి. మీకు అక్కడ మరో పేజీ ఓపెన్‌ అవుతుంది.   

మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి అకౌంట్‌లో లాగిన్ అవ్వండి.  

అనంతరం మీరు మీ ఖాతా వివరాలను ఎంటర్‌ చేసి ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. 

ఉమాంగ్‌ యాప్‌లో ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ ఎలా చెక్‌ చేయాలంటే  

♦ ఉమాంగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. ఇందుకోసం ఓటీపీ లేదా ఎంపీఐఎన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.  

♦ లాగిన్ చేసిన తర్వాత ఈపీఎఫ్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి.  

కాన్ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. 

♦ ఆ తర్వాత మీ యూఏఎన్‌ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి

♦ ఓటీపీని ఎంటర్‌ చేయండి 

ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్‌ఓ ఖాతా వివరాలను చూడవచ్చు. మెంబర్ ఐడిని సెలక్ట్‌ చేసుకుని ఇ-పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ ​​బ్యాలెన్స్‌ని చెక్ చేయండి

మీరు మీ యూఏఎన్‌ని ఉపయోగించి ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ ​​బ్యాలెన్స్‌ని చెక్‌ చేసుకోవచ్చు. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపండి. వెంటనే మీకు మీ ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ ఎంత ఉందో మీ మొబైల్‌ నెంబర్‌కి మెసేజ్‌ వస్తుంది.  

40ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీరేట్లు 
ఈపీఎఫ్‌ వడ్డీరేట్లను ఖాతాదారుల అకౌంట్లలోకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) జమ చేస్తోంది.  ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోసం సీబీటీ ప్రతి ఏడాది ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఓ బడ్జెట్‌ను తయారు చేస్తుంది. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.  

తాజా సమాచారం ప్రకారం, కోవిడ్‌ కారణంగా ఈపీఎఫ్‌ఓ ​​2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించింది. 40ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత కోవిడ్‌ కారణంగా వడ్డీని తగ్గిస్తూ వచ్చింది. 

గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 13.22శాతం పెరుగుదలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓకి 1.39 కోట్ల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు.  

మరిన్ని వార్తలు