తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. ఈ రంగంలో ఇక తిరుగులేదు

12 Jun, 2022 16:27 IST|Sakshi

తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రానుంది. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేవ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ తయారీ యూనిట్‌ని తెలంగాణలో స్థాపించనుంది. ఇందు కోసం ఏకంగా రూ.24,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ సెక్టార్‌లో ఇండియాలో ఇదే మొదటి యూనిట్‌గా రూపుదిద్దుకోబోతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది.

అమోల్డ్‌ డిస్‌ప్లే యూనిట్‌ స్థాపన విషయాలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు జపాన్‌, కొరియా, తైవాన్‌ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్‌ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని, దానికి తెలంగాణ వేదిక అవుతుందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్‌ తెలంగాణలో తయారవుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. 
 

చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?

>
మరిన్ని వార్తలు