మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్‌ కార్‌

30 Sep, 2021 13:24 IST|Sakshi

ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఏషియా ఆటోమోబైల్‌ కంపెనీలకు వెనక్కి నెట్టి హైపర్‌ కారు తయారీపై ఫోకస్‌ పెట్టింది.

బ్రాండ్‌ ఇమేజ్‌
ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్‌ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. తమ కంపెనీ నుంచి ట్రాక్టర్లు, జీపులు మొదలు హైపర్‌ కార్ల వరకు అన్నీ దొరుకుతాయనే మెసేజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా హై ఎండ్‌ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో రెనాల్ట్‌, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలపి ఇప్పటికే డిసైడ్‌ అయ్యింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

పినిన్‌ఫరినా
హైపర్‌ కార్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు మహీంద్రా సిద్ధమైందంటూ బ్లూబ్‌బర్గ్‌ మీడియా ప్రచురించింది. దీని ప్రకారం రాబోయే రెండేళ్లలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్‌ కారుని మార్కెట్‌లోకి తేనున్నాయి.

బటిస్టా
జెనివాలో 2019లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఫినిన్‌ఫరినా బటిస్టా కాన్సెప్టు కారును తొలిసారి ప్రదర్శించింది. 2020లో మార్కెట్‌లోకి తెస్తామని తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా కారు తయారీ పనులకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ సంస్థ 2022 ప్రథమార్థంలో కారును తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారు తయారీలో భాగస్వామ్యం కావాలని మహీంద్రా యోచిస్తోంది.

ఫీచర్లు 
అన్నీ అనుకూలిస్తే మహీంద్రా - ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో రాబోయే హైపర్‌కారుని పూర్తిగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌గా తయారు చేయబోతున్నారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఒక​‍్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 

ధర
మహీంద్రా- ఫినిన్‌ఫరినాలు సంయుక్తంగా మార్కెట్‌లోకి తెచ్చే అవకాశం ఉన్న ఈ హైపర్‌ కారు ధర 2.3 మిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి తొలి ఐదు బుకింగ్స్‌ పూర్తయ్యాయి. కేవలం 150 కార్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 

చదవండి : Mahindra XUV700: బుకింగ్స్‌ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్‌

మరిన్ని వార్తలు