Budget 2024-25: మహిళాసాధికారతకు ప్రధాన డిమాండ్లు

31 Jan, 2024 17:24 IST|Sakshi

మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ, భాగస్వామ్యం ఆశించినమేరకు లేదనేది వాస్తవం. ఉదాహరణకు కంపెనీల్లో అత్యున్నతస్థానంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ సదరు సం​స్థల్లో వారి సంఖ్య పెరగడం లేదు. 

ఇప్పుడిప్పుడే ప్రైవేటు సంస్థలు, ఇతర రంగాలు మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. వీటిని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. రానున్న బడ్జెట్‌లో వారి అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలంటు డిమాండ్‌ చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

  • మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌లో భాగంగా పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసే నగదుపై లభించే వడ్డీను పెంచేలా బడ్జెట్‌లో నిర్ణయాలు ఉండాలని కొందరు కోరుతున్నారు. ప్రసుత్తం 7.5శాతం వడ్డీ అందిస్తున్నారు. దీన్ని మరింత పెంచాలనే డిమాండ్‌ ఉంది.
  • వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే కొందరు భావిస్తున్నారు.
  • మహిళల సాధికారత కోసం సంప్రదాయ వ్యవహారాలకు భిన్నంగా వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించేలా చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి బడ్జెట్‌లో నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నారు.

  • 15-50 సంవత్సరాల వయసు ఉన్న మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దాంతో చాలామంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. రానున్న బడ్జెట్‌లో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. 
  • ఒంటరి మహిళల భద్రత, వారికి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేలా నిర్ణయాలు ఉండాలని కొందరు భావిస్తున్నారు. 
  • నిర్భయ ఫండ్ అనేది మహిళల భద్రత కోసం 2013లో స్థాపించిన నాన్ లాప్సబుల్ కార్పస్ ఫండ్. డిసెంబర్ 2023లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 70 శాతం నిధులు మాత్రమే అంటే రూ.7,212 కోట్లలో రూ.5,119 కోట్లు పథకం ప్రారంభం నుంచి వినియోగించారు. నేరాలు జరుగుతున్నా వాటిని అరికట్టేలా చర్యలు ఉండడం లేదు. ఈసారి బడ్జెట్‌లో మరింత నిధులు పెంచి వాటిని సమర్థ్యంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ ఉంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

  • శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతున్నా వారు తక్కువ జీతం, తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలను చేపడుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
     

whatsapp channel

మరిన్ని వార్తలు