నెట్‌ఫ్లిక్స్‌ మరో ఆప్షన్‌.. పేమెంట్స్‌ ఇప్పుడు మరింత ఈజీ

1 Sep, 2021 12:43 IST|Sakshi

Netflix UPI Payment: కస్టమర్లకు మరింత సుళువుగా మెరుగైన సేవలు అందివ్వడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ పేమెంట్‌ ఆప్షన్స్‌ని సరళతరం చేసింది. తేలికగా, వేగంగా అకౌంట్‌ రెన్యువల్‌ చేసుకునేలా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

50 లక్షల మంది చందాదారులు
ఓవర్‌ ది టాప్‌ ఆధారంగా వీడియో కంటెంట్‌ అందించే నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియాలో యాభై లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారు. వివిధ వర్గాల అవసరాలకు తగ్గట్టుగా పలు రకాల ప్లాన్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ అమలు చేస్తోంది. కనిష్టంగా నెలకు రూ. 200ల నుంచి గరిష్టంగా రూ. 799 వరకు వివిధ రకాల ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి,. అయితే కొత్త చందాదారులతో పాటు పాత సబ్‌స్క్రైబర్లు తమ ఖాతాను రెన్యువల్‌ చేసుకోవాలంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆధారంగానే చేసుకోవాల్సి వచ్చేది. ఇటీవలే ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా పేమెంట్‌ ఆప్షన్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) పేమెంట్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

యూపీఐ పేమెంట్స్‌
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి యూపీఐ పేమెంట్స్‌ పెరిగిపోయాయి. గూగుల్‌పే, ఫోన్‌ పే, పేటీఎం తదితర యాప్‌లను ఉపయోగించి రోజువారి లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరిగింది. టీ కొట్టు, పాన్‌ షాప్‌ల నుంచి బడా మాల్స్‌ వరకు యూపీఐ పేమెంట్స్‌ సాధారణ విషయంగా మారింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం యూపీఐ పేమెంట్స్‌కి ఇంతకాలం అవకాశం లేదు. తాజాగా యూపీఐ పేమెంట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులోకి తెచ్చింది.

యాక్టివేట్‌ చేసుకోండిలా
నెట్‌ఫ్లిక్స్‌ పేమెంట్స్‌ని యూపీఐ ద్వారా చేయాలంటే నెట్‌ఫ్లిక్స్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. 
- నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ని ఓపెన్‌ చేసి అకౌంట్‌ సెక‌్షన్‌లోకి వెళ్లాలి
- మేనేజ్‌ పేమెంట్‌ ఆప్షన్‌ని క్లిక్‌ చేయాలి
- చేంజ్‌ ది పేమెంట్‌ మెథడ్‌ని ఎంచుకోవాలి
- అక్కడ యూపీఐ ఆటోపే అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి యాక్టివేట్‌ చేసుకోవాలి.

చదవండి : ఈ మొబైల్‌ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, డిస్నీ హట్‌స్టార్‌ ఉచితం..!

మరిన్ని వార్తలు