ఇలా ఎలా అనిపించిన ఓలా.. అమ్మకాల్లో టాప్ లేపింది!

22 Dec, 2023 20:34 IST|Sakshi

ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్  2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..

నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు