పబ్‌జీ పోటీగా దేశీయ ఫౌ-జీ గేమ్

26 Nov, 2020 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ పబ్‌జీ బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వస్తున్న ఫౌ-జీ అనే దేశీయ మొబైల్ గేమ్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్‌లో టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా పబ్‌జీ కార్పొరేషన్ "పబ్‌జీ మొబైల్ ఇండియా" పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్‌జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. (చదవండి: ఈ వాట్సాప్ మెస్సేజ్ తో జర జాగ్రత్త!)

ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేయబడుతుందని కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్‌కోర్‌ గేమ్స్‌ పేర్కొంది. భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ పబ్‌జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ - 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్‌కోర్ గతంలో తెలిపింది. 'ఫౌ-జీ: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్' అనే మల్టీ-ప్లేయర్ గేమ్ పబ్‌జీ మొబైల్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కంపెనీలు కూడా అధికారికంగా గేమ్ ని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియజేయలేదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా