తల్లీకూతుర్లిద్దరూ సెలబ్రిటీలే.. స్టార్‌ హీరోయిన్‌ నుంచి అవకాశాల్లేని స్థాయికి.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో..

13 Nov, 2023 15:53 IST|Sakshi

ఫోటోలో కనిపిస్తున్న తల్లీకూతుర్లిద్దరూ నటీమణులే! తల్లి తన చిన్నవయసులోనే బాలనటిగా కెరీర్‌ మొదలుపెట్టింది. అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా నటిగా రాణించింది. ఆమె కూతురు కూడా తల్లి అడుగుజాడల్లో నడుస్తూ నటిగా అదరగొడుతోంది. ఇంతకీ తన అందంతో ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన ఆ హీరోయిన్‌ పేరు ముక్త. స్వస్థలం కేరళలోని కోలెంచరీ.

సీరియల్‌ నుంచి సినిమాకు..
తను పదవ తరగతి చదువుతున్నప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కనిపించింది. మొదట ఓ సీరియల్‌ చేసిన ఆమె తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఓట్ట ననయం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై మెరిసింది. ఆ మరుసటి ఏడాది ఫోటో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈమె డైరెక్ట్‌గా తెలుగులో నటించిన ఒకే ఒక సినిమా ఫోటో.

అవకాశాలు రాకపోవడంతో వెండితెరకు దూరం
ఆ తర్వాత హీరోయిన్‌గా తమిళ, మలయాళ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేసుకుంటూ పోయింది. అందులో తామిభరణి సినిమాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ తెలుగులో భరణిగా డబ్‌ అయింది. వెండితెరపై సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 2017లో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ బుల్లితెరపై మాత్రం పలు సీరియల్స్‌ చేసుకుంటూ పోయింది. ఈ మధ్యే వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. కురువై పాప అనే మలయాళ చిత్రంతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది.

తల్లి అడుగుజాడల్లోనే కూతురు
ముక్త క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా.. తనకంటూ సొంతంగా బ్యూటీ సెలూన్‌ కూడా ఉంది. ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ముక్త 2015లో సింగర్‌ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లాడింది. వీరికి కన్మని కియారా అనే కూతురు ఉంది. ఈమె సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ మధ్యే కింగ్‌ ఆఫ్‌ కొత్త అనే చిత్రంలోనూ నటించింది.

A post shared by KIARA RINKU TOMY (@kanmanikiara)

చదవండి: రైతుబిడ్డ వర్సెస్‌ అర్జున్‌.. శోభాను చెడుగుడు ఆడుకున్న ఆ ఇద్దరు!

మరిన్ని వార్తలు