ఈవీలపై ఎంత దూరమైనా ప్రయాణించేలా..

2 Mar, 2024 13:25 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా వాటి అమ్మకాలు హెచ్చవుతున్నాయి. కానీ విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టి చాలాకాలం అయినా ఇప్పటికీ వాటికి బ్యాటరీ సమస్యగానే ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఛార్జింగ్‌రాక ఇబ్బందులు పడుతున్నారు.

మార్గ మధ్యలో వాటిని ఛార్జ్‌ చేసుకోవాలన్నా చాలా సమయం పడుతుంది. అందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేలా క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ, బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 

ఇదీ చదవండి: రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్‌ లేడీ.. ఎలాగంటే..

ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్‌ల బ్యాటరీను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందం దేశంలోని అతిపెద్ద బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సహకారం ద్వారా 25 నగరాల్లోని 900కి పైగా స్వాప్ స్టేషన్‌ల్లో ‘బ్యాటరీ స్మార్ట్’ కంపెనీకు చెందిన బ్యాటరీలను క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం మార్చుకోవచ్చు. దాంతో క్వాంటమ్‌ వినియోగదారులు దూరప్రయాణాలు వెళ్తున్నపుడు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని రెండు నిమిషాల్లో పొందే వీలుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు