నాగబాబు ప్యాకప్‌ వెనుక కారణం ఏంటంటే.. | Janasena Nagababu Return To Hyderabad From Anakapalli, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో జెండా ఎత్తేసిన నాగబాబు.. ప్యాకప్‌కు కారణం ఏంటంటే..

Published Sat, Mar 2 2024 1:18 PM

Janasena Nagababu Return To Hyderabad - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఇద్దరూ పార్ట్‌ టైమ్‌ పొలిటిషీయన్స్‌ అని మరోసారి రుజువు చేసుకున్నారు.  ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా చంద్రబాబుకు సహకరించేందుకే వారు ఉన్నట్టు నిరూపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే..

జనసేన నేత నాగబాబు.. అనకాపల్లిలో నుంచి జెండా ఎత్తేశారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగాబాబు ఏపీకి వచ్చారు. అనంతరం, అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావుడి చేశారు. సమీక్షల పేరుతో కలరింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో సర్వేలు కూడా చేయించుకున్నట్టు సమాచారం.

అయితే... సర్వేల్లో ప్రతికూల ఫలితాల కారణంగా ఓటమి భయం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో, నాగబాబు తన మకాంను అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు మార్చారు. తాజాగా మూటాముల్లె సర్దుకుని నాగాబాబు హైదరాబాద్‌కు పయనమయ్యారు. 

మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున ఏపీకి వచ్చిన పవన్‌.. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై పవన్‌ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు తాను ఎక్కడ పోటీ చేస్తున్న విషయం కూడా ఆయన చెప్పలేదు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేయలేదు. ఇక, ఏపీలో రాజకీయాలు అంటూ పవన్‌ మళ్లీ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. దీంతో, ఇలాంటి నేతలా ఏపీ ప్రజల బాగు కోరేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement