ఈకామ్‌ రుణాలు ఆపేయండి

16 Nov, 2023 05:04 IST|Sakshi

బజాజ్‌ ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్‌ ఫైనాన్స్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్‌ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం.

సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్‌ ఫైనాన్స్‌ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది.

మరిన్ని వార్తలు