రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్‌

13 Nov, 2023 18:11 IST|Sakshi

పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు