లావాకి షాకిచ్చిన సెబీ.. ఐపీవోకు బ్రేక్‌

18 Jan, 2023 07:14 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక దరఖాస్తును క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపించింది. కొన్ని అంశాలలో తాజా సమాచారాన్ని క్రోడికరించి తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. వెరసి లావా లిస్టింగ్‌ ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

లావా, జోలో బ్రాండ్లతో మొబైల్‌ హ్యాండ్‌ సెట్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్‌ ప్రొడక్టులను లావా ఇంటర్నేషనల్‌ రూపొందిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా కంపెనీ 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండుకు ప్రాచుర్యం, ఇతర సంస్థల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది.

చదవండి: విమాన ప్రయాణం.. మీ మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయమంటారు, ఎందుకో తెలుసా?

>
మరిన్ని వార్తలు