స్కోడా నుంచి సరికొత్త స్లావియా

1 Mar, 2022 06:17 IST|Sakshi

ధర రూ. 10.69 లక్షల నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్‌–సైజ్‌ సెడాన్‌ సెగ్మెంట్‌లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 15.39 లక్షల (ఎక్స్‌ షోరూం) శ్రేణిలో ఉంటుంది. నెలకు 2,500–3,000 యూనిట్ల విక్రయాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కంపెనీ బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హాలిస్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సెగ్మెంట్‌ లీడరుగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 179 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్, పార్కింగ్‌ సెన్సార్లు, ఆటోమేటిక్‌ బ్రేక్‌ డిస్క్‌ క్లీనింగ్, రియర్‌ వ్యూ కెమెరా, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్, హిల్‌–హోల్డ్‌ కంట్రోల్, క్రూయిజ్‌ కంట్రోల్‌ తదితర ఫీచర్లు కొత్త    స్లావియాలో ఉంటాయి.  

మరిన్ని వార్తలు