ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం, అంతరిక్షంపై నడక కోసం!

15 May, 2022 10:34 IST|Sakshi

ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరో సంచలనానికి తెరతీయనుంది. నలుగురు వ్యక్తులు  సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్‌ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు మే నెలలో స్పేస్‌ ఎక్స్‌ ట్రైనింగ్‌ను ప్రారంభించనుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఆ నలుగురు సిబ్బంది అంతరిక్షంపై కాలు మోపనున్నారు.      


ఇప్పటివరకు భూమి నుంచి 853 మైళ్ల ఎత్తులో భూ కక్ష్యను చేరిన రికార్డ్‌ ఉంది. అయితే ఇప్పుడు 'ఇన్స్పిరేషన్‌4'..ఎలన్‌ మస్క్‌ తన స్పేస్‌ఎక్స్‌ అంతరిక్షయానానికి పెట్టిన పేరు. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్‌4 ద్వారా షిఫ్ట్‌4 పేమెంట్స్‌ అధినేత, బిలియనీర్‌ జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ నేతృత్వంలోని పొలారిస్ డాన్ మిషన్ ద్వారా ఇప్పుడా ఆ రికార్డ్‌ను అధిగమించి 870 మైళ్ల గరిష్ట ఎత్తుకు చేరుకోవాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్‌ తన ట్రైనింగ్‌ను  ప్రారంభించనుంది. 


 
అన్నీ అనుకున్నట్లు జరిగితే, 1972లో చివరిగా చంద్రుడు దిగినప్పటి నుండి మళ్లీ ఇప్పుడు మానవులు భూమి నుండి అంతరిక్షానికి ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డ్‌ నెలకొల్పనుంది.

వచ్చే వారం నుంచే ట్రైనింగ్‌ 
ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పొలారిస్ డాన్ మిషన్ లో పాల్గొనేందుకు క్రూ సిబ్బంది సిద్ధమవుతుందని ఐసాక్‌మాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఆస్ట్రోనాట్స్‌ మిషన్‌లో స్పేస్‌ ఎక్స్‌ బిజీ బిజీ 
2020 నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థ భూమి మీద నుంచి 408 కిలోమీట్ల దూరంలో ఉన్న స్పేస్‌ స్టేషన్‌ నాసాకు ఆస్ట్రోనాట్స్‌ను పంపిస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో క్రూ-3కి చెందిన ఆస్ట్రోనాట్స్‌లు రాజా చారి, థామస్‌ మార్ష్‌బర్న్, కైలా బారన్, మాథియాస్ మౌరర్'లను స్పేస్‌ ఎక్స్‌ సంస్థ నాసాకు పంపించింది. మళ్లీ 6నెలల త్వరాత ఆ క్రూ-3 సిబ్బంది మే6 (శుక్రవారం ఉదయం)న అమెరికాలోని సముద్ర ప్రాంతమైన ఫ్లోరిడాలో ల్యాండ్‌ అయ్యారు.  

ఐసాక్‌ మాన్‌ ఇంటర్వ్యూ 
స్పేస్‌ ఫ్లైట్‌ నౌ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఐసాక్‌మాన్‌ స్పేస్‌వాక్‌ గురించి మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ ప్రస‍్తుతం కూ-3, ప్రైవేట్‌ ఏఎక్స్‌-1 లాంచింగ్‌, లాంచ్‌ క్రూ-4తో బిజిగా ఉంది. త్వరలో స్పేస్‌ వాక్‌ కోసం  ట్రైనింగ్‌ తీసుకోబోతున్నాం' అని వెల్లడించారు.      

రీయూజబుల్‌ రాకెట్లతో 
రీయూజబుల్‌ రాకెట్లతో (పునర్వినియోగ రాకెట్) పోరాలిస్‌ ప్రోగ్రామ్‌ సిరీస్‌ లాంచ్‌ కానున్నాయని, దానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు ఐసాక్‌మాన్‌ తెలిపారు. అంతేకాదు ఐజాక్‌మాన్ రీయూజబుల్‌ రాకెట్లతో స్టార్‌షిప్‌లో మొదటి స్పేస్‌ వాక్‌ మూడవ పొలారిస్ ప్రోగ్రామ్ లాంచ్ కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు.

చదవండి👉చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

మరిన్ని వార్తలు