విలాసవంతమైన నివాస భవనాల్లో టాప్‌ నగరాలు ఇవే..

2 Nov, 2023 11:01 IST|Sakshi

ప్రపంచంలోనే విలాసవంతమైన నివాస భవనాల ధరలు పెరుగుతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న జాబితాలో గ్లోబల్‌గా ముంబయి నాలుగోస్థానంలో ఉంది. అందుకు సంబంధించి నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌ క్యూ3 2023’ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నివేదిక లగ్జరీ గృహాల సగటు వార్షిక ధరల వృద్ధిని సూచిస్తుంది. 

ఇదీ చదవండి: దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు

దేశంలోని ముంబయి(నాలుగోస్థానం), దిల్లీ పదో స్థానం, బెంగళూరు 17వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 46 నగరాల్లో సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ముంబయి 22వ స్థానం ఉంది. ఏడాది కాలంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో 6.5 శాతం పెరిగాయి. దాంతో 18 స్థానాలు ఎగబాకింది. దిల్లీ, బెంగళూరు సైతం వాటి ఇండెక్స్‌ను మెరుగుపరుచుకున్నాయి. గ్లోబల్‌ ఇండెక్స్‌లో తొలి మూడు స్థానాల్లో మనీలా(ఫిలిప్పీన్స్‌), దుబాయ్‌(యూఏఈ), షాంఘై(చైనా) నిలిచాయి.

మరిన్ని వార్తలు