భారీ పెట్టుబడులకు వేదాంతా సై

25 Mar, 2024 06:15 IST|Sakshi

6 బిలియన్‌ డాలర్ల వెచ్చింపునకు ప్రణాళికలు

న్యూఢిల్లీ: మైనింగ్‌ రంగ ప్రయివేట్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్‌ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్‌ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు.

పైప్‌లైన్‌లో 50 యాక్టివ్‌ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్‌ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్‌ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్‌ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు.

ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్‌ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు అనిల్‌ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్‌ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్‌ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్‌ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు.

Election 2024

మరిన్ని వార్తలు