Vinod Kannan: మీ అంచ‌నాల్ని అందుకోలేక‌పోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాక‌రోనా ఎఫెక్ట్‌

17 Feb, 2022 08:18 IST|Sakshi

ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్‌ సీఈవో వినోద్‌ కన్నన్‌ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్‌లైన్స్‌ కాల్‌ సెంటర్‌ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. 

‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ  కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్‌సైట్‌ కానీ, యాప్‌ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్‌గ్రౌండ్‌ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. 

కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు