ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌

2 Sep, 2023 04:30 IST|Sakshi

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదముద్ర  

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్‌ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్‌ కమిషన్‌ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్‌కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ పై చేసిన ఒక పోస్టింగ్‌లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన)

  ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. 

విస్తారా, ఎయిర్‌ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న  రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్‌ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్‌ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో టాటా గ్రూప్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు