వర్క్‌ ఫ్రం హోంపై విప్రో కీలక నిర్ణయం

6 Nov, 2023 21:04 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో వర్క్‌ ఫ్రం హోంపై  కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి 3 రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్‌ పాలసీలో భాగంగా నవంబర్‌ 15,2023 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన మెయిల్స్‌లో పేర్కొంది. 

ఇప్పటికే భారత్‌లోని టెక్‌ కంపెనీలు పూర్తి స్థాయిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో మార్పులు చేశాయి. టెక్కీలు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబడుతున్నాయి. 

తాజాగా, విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్‌ ఈ పాలసీ గురించి మాట్లాడుతూ ఉద్యోగులు కలిసి పనిచేసేందుకు ప్రోత్సహ్తిస్తూ కార్పొరేట్‌ సంస్కతిని మరింత బలోపేతం చేసేలా హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను డిజైన్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా  వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానిక నిబంధనలు పాటిస్తూ తగు మార్పులు చేస్తామని పేర్కొన్నారు.  
 
కొత్త వర్క్‌ పాలసీ అనుసరించలేదంటే?
కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, జనవరి 7, 2024 నుండి పరిణామాలు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు తెలిపింది. మరి తాజా యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు