ఉద్యోగులకు టాటా స్టీల్‌ భారీ షాక్‌.. 800 మంది తొలగింపు

15 Nov, 2023 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు.

టాటా స్టీల్‌ యూరప్‌ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్‌ యూకే, టాటా స్టీల్‌ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్‌ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్‌ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్‌ ఉంది. 

మరిన్ని వార్తలు