శ్వేత బాడీపై గాయాలు.. భర్తే కీలక సూత్రధారి

6 May, 2022 06:54 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నెలమంగల తాలూకా తోణచినకొప్పె గ్రామంలో వెలుగుచూసింది.  చౌడేశ్‌ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. 

చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా కురుబరహళ్లికి చెందిన చౌడేశ్‌కిచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు చౌడేశ్‌. అయితే అప్పటికే ఆమె చనిపోయి ఉందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని చౌడేశ్‌ నమ్మించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసికెళ్లగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు