Hyderabad: యువతి ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలిసేందుకు వెళ్లడంతో..

2 Jul, 2022 19:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మగువ ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలువడానికి వెళ్లిన ఓ బాధితుడు మోసపోయిన సంఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని మహిళ పాత పాల్వంచ, కొత్తగూడెం–భద్రాద్రి జిల్లాకు చెందిన ఏ2 పల్లపు రోజ, అలియాస్‌ మానస(24), జనప్రియ వెస్ట్‌సిటీ, మియాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసింది. ఫోన్‌కు స్పందించి ఆమెను కలువడానికి జూన్‌ 27న పోచారం మున్సిపాలిటీ శివాలయం దగ్గరికి వచ్చాడు. 

అదే సమయంలో అక్కడే కాపుకాసిన హమాలి కాలనీ పాల్వంచ, కొత్తగూడెంకు చెందిన ఏ1 కందుల వంశీ అలియాస్‌ కుమార్‌(35), ఏ3 శ్రీరాంపురం, భీమవరం, పశ్చిమగోదావరికి చెందిన సాగి వర్మ (26), ఏ4 పోచారం శివాలయంలో సమీపంలో నివసించే సీతానగర్, పాల్వంచ, పశ్చిమ గోదావరికి చెందిన పల్లపు దేవి(25) అతడిని నిర్బంధించారు. అతడిని బెదిరించి హెచ్‌డీఎఫ్‌ డెబిట్‌ కార్డు ద్వారా రూ.లక్ష, ఏటీఎం ద్వారా పలు దఫాలుగా రూ.2,02,254లు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదైంది.

జూన్‌ 30న రాత్రి కుషాయిగూడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా పై కేసులో నిందితులని తేలింది. వారి దగ్గరి నుంచి రూ.1,60,254లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగ ఏ1, ఏ2లు ఒక జంటగా, ఏ3, ఏ4లు భార్యభర్తలు. తక్కువ సమయంలో కేసు చేధించిన సీఐ చంద్రబాబు, డీఐ జంగయ్య, క్రైం ఎస్సై సుధాకర్‌ సహచర బృందాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ అభినందించారు.   
చదవండి: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు!

మరిన్ని వార్తలు