అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి

7 Aug, 2020 10:12 IST|Sakshi
దినేష్‌ (ఫైల్‌)

అత్తింటివారి వేధింపులతోనని కుటుంబ సభ్యుల ఆరోపణ

మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మందమర్రి రైల్వేలైన్‌పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్‌ (29)కు మూడేళ్ల క్రితం జైపూర్‌ మండలం ఇందారానికి చెందిన అమలతో పెళ్లయ్యింది. ఆ సమయంలో సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని అమ్మాయి కుటుంబం చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పెట్టించలేదు. పైగా అత్తగారింట్లో ఎవరూ మర్యాద ఇవ్వకపోవడంతో అమల, దినేష్‌ మధ్య తగాదాలు మొదలయ్యాయి.

దినేష్‌ సీసీసీలోని షిర్కే క్వార్టర్స్‌లో ఉంటూ జైపూర్‌ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌ వద్ద స్కిల్డ్‌వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వారం క్రితం అమల దినేష్‌తో గొడువ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం దినేష్‌ రైలుపట్టాలపై మృతి చెంది ఉన్నాడు. దినేష్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దినేష్‌ మృతికి ఆయన భార్య, అత్తమామలే కారణమని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు