ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదం కేసు.. పోలీసుల కీలక ముందడుగు

1 Mar, 2024 11:35 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. లాస్య నందిత కారు అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) రెయిలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయే ముందు తొలుత ఢీకొన్న టిప్పర్‌ లారీని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత కారు ఓఆర్‌ఆర్‌పైకి ఎంట్రీ అయిన సమయంలో ముందు వెళ్తున్న లారీని సీసీ కెమెరా ఫుటేజ్‌ సహాయంతో గుర్తించారు. టిప్పర్‌ డ్రైవర్‌ను పటాన్‌చెరు పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్‌ను ఢీకొట్టడొంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్‌ వెల్లడించాడు.

వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్‌ను డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. తొలుత టిప్పర్‌ను ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పిన కారు 100 మీటర్ల దూరం వెళ్లి రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న లాస్య నందిత పీఏ ఆకాష్‌ నిద్ర మత్తులోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత స్పాట్‌లోనే మృతి చెందారు. 

ఇదీ చదవండి.. పరీక్షకు ఆలస్యం.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

whatsapp channel

మరిన్ని వార్తలు