ఏడేళ్ల బాలికపై మేనమామ లైంగికదాడి 

24 Mar, 2022 09:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అబిడ్స్‌: ఏడేళ్ల మైనర్‌ బాలికపై మేనమామ (19) లైంగికదాడి చేసిన ఘటన బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పాతబస్తీకి చెందిన ఏడేళ్ల బాలిక పటేల్‌నగర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి ఈనెల 18వ తేదీన వచ్చింది. ఆటో డ్రైవర్‌ అయిన మేనమామ(19) బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు దుస్తులు చిరిగినట్లు గమనించిన తల్లి..బాలికను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు