Telugu Academy: రిమాండ్ రిపోర్టు కీలక విషయాలు

7 Oct, 2021 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలుగు అకాడమి డిపాజిట్లలో కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. తొమ్మిది పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 10మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా పోలీసులు తేల్చారు.

కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు. భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని పేర్కొన్నారు. ఏడాది కాల వ్యవధికి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు.

64.5కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20కోట్లు సాయి కుమార్, 7కోట్లు వేంకటరమణ, 3కోట్లు రాజ్ కుమార్, 3కోట్లు వేంకటేశ్వర్ రావు, 6కోట్లు కృష్ణారెడ్డి, 2.5కోట్లు భూపతి, 6కోట్లు రమణా రెడ్డి, 50లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు. నిందితులు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, కస్టడికి తీసుకొని విచారించాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా పరారీ నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీఎస్ పోలీసులు రిమాండ్‌ రిపోర్టు వివరించారు. 

మరిన్ని వార్తలు