తిరుమల వెళ్లొచ్చే సరికి ఇంట్లో చోరీ

29 Jun, 2021 11:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భీమారం: గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 56వ డివిజన్‌లోని టీఎన్జీవోస్‌కాలనీలో చోరీ జరిగింది. ఈ ఘటనలో 15తులాల బంగారం, రూ.50వేలు నగదు అహహరణకు గురైంది. కేయూ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. టీఎన్జీవోస్‌ కాలనీకి చెందిన అద్దంకి నాగేశ్వర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 25న దైవదర్శనానికి తిరుమల వెళ్లి 28న తిరిగి వచ్చారు. అయితే, అప్పటికే వంట గదిపక్కన ఉన్న తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి బీరువా ధ్వంసం చేయడంతో పాటు బట్టలు చిందరవందరంగా పడి ఉన్నాయి.

అందులో దాచిన బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో మంగళవారం కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

చదవండి: 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్‌.. ప్రియునితో కలిసి...

మరిన్ని వార్తలు