ఎనిమిదేళ్ల ప్రేమ, పెళ్లి.. నా భార్యను కిడ్నాప్ చేశారు..

20 Jul, 2021 11:53 IST|Sakshi

సాక్షి, భీమదేవరపల్లి(వరంగల్‌): తమ కుటుంబంపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్‌ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారం గ్రామానికి చెందిన సైదులు, జంగయ్యలపై చర్య తీసుకోవాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన రూపాని వంశీ కోరారు. ఈ మేరకు వంగర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు.  అనంతరం వంశీ విలేకరులతో మాట్లాడుతూ జైకేసారం గ్రామానికి చెందిన గంజి స్వాతి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, కులాలు వేరు కావడంతో ఆమె తల్లిదండ్రులు తమ పెళ్లికి నిరాకరించారన్నారు.

ఇద్దరం మేజర్లం కావడంతో మే 6న నల్లగొండలోని ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.  స్వగ్రామమైన రంగయపల్లిలో నివాసముంటుండగా సోమవారం స్వాతి కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి  దాడిచేశారన్నారు. అనంతరం స్వాతిని బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు. కులాలు వేరు కావడంతో ఇద్దరిని విడదీసేందుకు కుట్ర పన్నుతున్నారని, తనకు ప్రాణభయం ఉందని వాపోయాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు