బంజారాహిల్స్‌: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన 

2 Jun, 2022 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్‌కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు.

ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే..  బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
చదవండి: అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి..

మరిన్ని వార్తలు