చెరకు రైతులకు ప్రోత్సాహక ధర

19 Nov, 2023 01:40 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న రవికాంత్‌

తణుకు: తణుకు ఆంధ్రా సుగర్స్‌ ఆధ్వర్యాన నడుస్తున్న తాడువాయి కర్మాగారంలో 2023–24కు గాను రైతులకు ప్రోత్సాహకమైన చెరకు ధరను నిర్ణయించినట్లు ఆంధ్రా సుగర్స్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌, అదనపు సెక్రటరీ పీవీఎస్‌ విశ్వనాథ కుమార్‌ తెలిపారు. సంక్రాంతి పండగ ముందు చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు రూ.3,200, సంక్రాంతి తర్వాత సరఫరా చేసే వారికి టన్నుకు రూ.150 అదనపు ప్రోత్సాహకం కలిపి టన్నుకు రూ.3,350 చెల్లించాలని నిర్ణయించినట్టు వివరించారు.

అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో

రవికాంత్‌ ప్రతిభ

మామిడికుదురు: దుబాయ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో మామిడికుదురు మండలం మొగలికుదురు వాసి కూర్మా రవికాంత్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కేటగిరీలో మొదటి బహుమతి సాధించాడు. ఈ నెల 16వ తేదీన దుబాయ్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో రవికాంత్‌కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ప్రశంసాపత్రంతో పాటు 15 వేల యూఎస్‌ డాలర్లు (రూ.12.50 లక్షలు) నగదు బహుమతి అందించారు. ‘ఎ డ్యాన్స్‌ ఆఫ్‌ సీగల్స్‌’ పేరిట ఈ పోటీ నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని రవికాంత్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ పోటీల్లో మన దేశం నుంచి తానొక్కడినే పాల్గొన్నానని చెప్పారు. బీటెక్‌ పూర్తి చేసిన రవికాంత్‌ ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో మొదటి బహుమతి గెలుపొందిన రవికాంత్‌ను పలువురు అభినందించారు.

బహుమతి పొందిన రవికాంత్‌ చిత్రం

మరిన్ని వార్తలు