ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో

24 Feb, 2024 11:51 IST|Sakshi

టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్‌ఫుల్‌గా, ముఖ్యంగా ఎయర్‌హెస్టెస్‌ తదితర సిబ్బంది డ్రెస్‌ కోడ్‌ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను కూడా ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో  నెటిజనులను  బాగా ఆకట్టుకుంది.

దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను  తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి  ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది.  వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. 

"శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్‌ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్‌అంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. మెకాన్ వరల్డ్‌గ్రూప్‌కు చెందిన ప్రసూన్ జోషి,  ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ,  డైరెక్టర్‌  భరతబాల   సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను  దీన్ని తీసుకొచ్చారు. 

భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ  కాంప్‌బెల్ విల్సన్  

whatsapp channel

మరిన్ని వార్తలు