కొంపముంచిన స్టంట్‌: ఏకంగా 29వ అంతస్థు నుంచి

29 Jan, 2024 11:03 IST|Sakshi

సోషల్‌ మీడియాకోసం చేసిన  ఒక యువ  స్కైడైవర్ సాహసం విషాదాంతమైంది.  29 అంతస్తుల అపార్ట్‌మెంట్ బ్లాక్ పైకప్పు నుండి  డైవింగ్‌ చేస్తూన్న క్రమంలో  33 ఏళ్ల బ్రిటీష్ బేస్ జంపర్ ప్రాణాలను కోల్పోయాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కేంబ్రిడ్జ్‌షైర్‌కు చెందిన నాథీ ఓడిన్సన్ (33)  శనివారం రాత్రి 29 అంతస్తుల భవనంపై నుంచి దూకాడు.  ఈ సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ముందు చెట్టును బలంగా ఢీకొట్టి, ఆ తరువాత నేలపై పడి  దుర్మరణం పాలయ్యాడు.  సోషల్ మీడియా కోసం చేసిన  ఈ స్కై డైవింగ్‌ వీడియో స్టంట్‌  తీరని విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు  ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్‌లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఇలాంటి సాహసోపేత వీడియోలను నాతీస్ స్కై ఫోటోగ్రఫీ పేరుతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ పేజీల్లో గతంలో చాలానే షేర్‌ చేశాడు. అంతేకాదు ఇలాంటి సాహసాలు చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు కూడా.  స్కైడైవింగ్‌లో  ఎన్నోఏళ్ల అనుభవం ఉన్న  ఓడిన్సన్‌ దుర్మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు.

నిబంధనల్లో నిర్లక్ష్యం వహిస్తే.. జరిగేది రామోజీ  ఫిలిం సిటీ ఘటనే

ఇటీవల రామోజీ  ఫిలిం సిటీలో జరిగిన ప్రమాదం తీవ్ర నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ప్రమాదంలో  అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో దుర్మరణం పాలయ్యారు. లైమ్లైట్ గార్డెన్‌లో విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుక‌లను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కానీ సరైన జాగ్రత్తలు  తీసుకోకపోవడం, భద్రతా ఏర్పాట్ల కొరత కారణంగా టెక్‌ సంస్థ  సీఈవో సంజయ్ షా ప్రాణాలు పోయాయి.  అలాగే ఈ సంస్ధ  ప్రెసిడెంట్  దాట్ల విశ్వనాథ్ అలియాస్  ఆసుపత్రి పాలైనారు. సమయానికి  అంబులెన్స్‌ కూడా అందుబాటులోలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

(చదవండి : రామోజీ ఫిల్మ్‌ సిటీపై కేసు)

A post shared by Nathy (@nathyskyphotography)

whatsapp channel

మరిన్ని వార్తలు