కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?

23 Apr, 2021 16:15 IST|Sakshi

వేసుకోకూడదు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై కోలుకున్న వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు తొందరపడకూడదు. కోలుకున్నాక కనీసం 4 నుంచి 8 వారాల వరకు టీకా అవసరం లేదని కేంద్రం చెబుతోంది. కరోనా బారిన పడి కోలుకున్న 85 శాతం మంది శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి ఉంటాయి. మిగతా వారిలో టీ సెల్‌ ఆధారిత రక్షణ ఉంటుంది. ఈ దశలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ప్రకారం 90 రోజులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం 6 నెలల వరకు కూడా వ్యాక్సినేషన్‌ వాయిదా వేసుకోవచ్చు. వాస్తవానికి చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా విధానాలు ఉన్నాయి. మొత్తంగా కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్నామంటేనే మనలో రక్షణ ఏదో ఒక రూపంలో (బీ లేదా టీ సెల్‌) ఉంటుంది. అంటే మళ్లీ కరోనా వచ్చే అవకాశం దాదాపు 6 నెలల వరకు తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకుంటే సరిపోతుంది.

- డాక్టర్‌ కిరణ్‌ మాదల 
క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

ఇక్కడ చదవండి:
పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..?

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమా?

ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ పెరుగుతుందా?

మరిన్ని వార్తలు