300 కార్లు, ప్రైవేట్‌ ఆర్మీ, సొంత జెట్స్‌ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్‌ సంపద

31 Jan, 2024 16:53 IST|Sakshi

మలేషియా కొత్త రాజుగా బిలియనీర్‌ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్‌ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా  ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర  సంపదపై ఆసక్తి నెలకొంది.  

మలేషియాలో ఇప్పటికీ  ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు.  దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. 


దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్  నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు.  రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా  ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన ‘యూ’ మొబైల్‌లో 24శాతం  వాటాతో పాటు, ఇతర  అదనపు పెట్టుబడులూ ఉన్నాయి.

అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్,  సుల్తాన్‌ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్‌బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్‌లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్‌ డాలర్లు ఉంటుందట.

సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు  ప్రాముఖ్యతను సంతరించుకుంది.   ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా.  సింగపూర్‌ బిజినెస్‌ టూకూన్స్‌తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్‌లతో  వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు.

whatsapp channel

మరిన్ని వార్తలు