మాట్లాడుతూ.. ప‌దాల‌తో త‌డ‌బ‌డుతున్నారా!? అయితే ఇలా చేయండి!

16 Dec, 2023 12:16 IST|Sakshi

మాటలు ధారాళంగా మాట్లాడ‌టం, ప‌ల‌క‌డం మనుషులకున్న గొప్ప వరం. ఈ పుడ‌మిలో మ‌రే జీవానికి ఈ అవకాశం లేదు. ఒక‌వేళ అవి గొంతు చీల్చుకుని అరిచినా, ప‌దాలను మాత్రం ప‌ల‌క‌లేవు. కానీ మ‌నం మాత్రం ప‌లుక‌గలం. ఈ క్ర‌మంలో కొంద‌రు మాట్లాడ‌టంలో, అక్ష‌రాలు ప‌ల‌క‌డంలో ఎంత‌గానో త‌డ‌బ‌డుతుంటారు. నాలుక తిర‌గ‌ని ప‌దాల‌తో లోలోనే సంకోచిస్తూంటారు. ఇక‌పై ఈ చిన్న ట్రిక్ వాడారో, ఇలాంటి స‌మ‌స్య‌ల‌ నుంచి దూరం అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. మ‌రదేంటో చూద్దాం!

మాటలు స‌రిగ్గా రానివారి కోసం..
వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయల రసం పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత మళ్లీ దంచి మెత్తగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి, మాటలు ముద్దగా పలికేవారికి, ఆగి ఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి మాటలు స్పష్టంగా వస్తాయి.

• లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధాన్ని నాలిక పైన రాస్తున్నా మాటలు త్వరగా వస్తాయి.

క్షయరోగానికి..
క్షయ.. అదేనండీ.. టీబీతో ఇబ్బంది పడేవారు అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరటమే కాక శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి కూడా తగ్గుతుంది.

గొంతులో కఫం..
వామాకు, తులసాకు, తమలపాకుని రోజూ తింటూ ఉంటే గొంతులో కఫం తగ్గిపోతుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడిని తేనెలో రంగరించి రెండు పూటలా చప్పరించినా గొంతులో గరగర, శ్లేష్మం పడటం వంటి సమస్యలు తొలగిపోతాయి.

ఇవి చ‌ద‌వండి: బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!

>
మరిన్ని వార్తలు