మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!

3 Mar, 2024 14:03 IST|Sakshi

కావలసినవి:  బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్‌ – 1 కప్పు చొప్పున
పీనట్‌ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – అర టీ స్పూ¯Œ , 
బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్‌ చిప్స్‌ – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున
కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి)

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, పీనట్స్‌ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్‌ చిప్స్‌ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్‌ చేసుకోవాలి.

ఇవి చదవండి: స్వీట్‌ పొటాటో బన్స్‌.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!

whatsapp channel

మరిన్ని వార్తలు