Sweet Potato Bun Recipe: స్వీట్‌ పొటాటో బన్స్‌.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!

3 Mar, 2024 13:47 IST|Sakshi

కావలసినవి:  చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించుకుని, తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి)
ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
కొబ్బరి తురుము – అర కప్పు
కారం – అర టీ స్పూన్‌ 
కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్‌ 
జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌ 
ఆమ్‌చూర్‌ పౌడర్‌ – అర టీ స్పూన్‌ 
గోధుమ పిండి – 2 కప్పులు
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
నూనె, గోరువెచ్చని నీళ్లు – కొద్దికొద్దిగా
ఉప్పు – తగినంత
నువ్వులు – కొద్దిగా

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్‌ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌  చేసుకుని.. పాన్‌  పెట్టుకుని.. 1 టేబుల్‌ స్పూన్‌  నూనెలో ఉల్లిపాయ ముక్కలు, చిలగడదుంపల ముక్కలు, కొబ్బరి తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి.

అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అప్పడాల్లా ఒత్తి.. అందులో చిలగడదుంపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి.. తిరిగి మళ్లీ బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నువ్వులు అద్ది.. ఓవెన్‌ లో బేక్‌ చేసుకోవాలి.

ఇవి చదవండి: ఈ స్టీమర్‌ కుకింగ్‌ ఎలక్ట్రికల్‌ పాట్‌.. గురించి విన్నారా..!

whatsapp channel

మరిన్ని వార్తలు