పెరసపప్పుతో ఫేస్‌ప్యాక్‌.. ముఖ్యం బంగారంలా వెలిగిపోతుంది

21 Dec, 2023 16:27 IST|Sakshi

బ్యూటీ టిప్స్‌

ఎర్ర పప్పు మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్‌ప్యాక్‌ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది.

కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్‌) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్‌ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. 

► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. 

► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్‌ పీల్‌ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. 

హెయిర్‌ టిప్స్‌

► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్‌ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. 

>
మరిన్ని వార్తలు