బీట్‌రూట్‌ పాప్‌ కార్న్‌ ఎప్పుడైనా తిన్నారా? మరీ బెల్గావి స్వీట్‌.. ఇంట్లోనే ఈజీగా!

21 Oct, 2021 12:53 IST|Sakshi

ఇంట్లో తయారు చేసిన స్నాక్స్‌ ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా డబ్బును ఆదా చేస్తుంది. వెరయిటీగా ఈ వంటకాల తయారీని ప్రయత్నించి చూద్దాం.. 

బెల్గావి స్వీట్‌

చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.

కావల్సిన పదార్థాలు
►వెన్నతీయని పాలు – కప్పు 
►పంచదార – అర కప్పు
►కోవా – ముప్పావు కప్పు
►పెరుగు – టేబుల్‌ స్పూను
►జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►యాలకుల పొడి – అరటీస్పూను.

తయారీ విధానం 
►స్టవ్‌ మీద నాన్‌స్టిక్‌ బాణలి పెట్టి పంచదార వేయాలి.  
►మీడియం మంట మీద పంచదార బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి.  
►రంగు మారగానే మంట తగ్గించి పాలు పోయాలి.  
►ఇప్పుడు మీడియం మంట మీద పాలు కాగనివ్వాలి. పాలుకాగాక, పెరుగు వేసి తిప్పాలి. పాలు విరిగినట్లుగా అవుతాయి. అప్పుడు కోవా వేసి బాగా కలుపుకోవాలి. 
►ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరి దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి తిప్పితే బెల్గావి రెడీ.    

బీట్‌రూట్‌ పాప్‌ కార్న్‌

కావల్సిన పదార్థాలు
►బీట్‌రూట్‌ – 1 (ముక్కలు కట్‌ చేసుకుని, ఒక గ్లాసు వాటర్‌ కలిపి, మిక్సీ పట్టి, వడకట్టుకుని రసం తీసుకోవాలి)
►పంచదార – అర కప్పు
►మొక్కజొన్న గింజలు – 1 కప్పు
►యాలకుల పొడి – కొద్దిగా
►రెయిన్‌బో స్ప్రింకిల్స్‌ – 1 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి)
►నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం 
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, పాత్రలో పంచదార, బీట్‌రూట్‌ జ్యూస్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈలోపు మరో స్టవ్‌ మీద కుకర్‌లో నూనె వేసుకుని, మొక్కజొన్న గింజలు వేసుకుని పాప్‌కార్న్‌ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, బీట్‌ రూట్‌ జ్యూస్‌ మిశ్రమాన్ని వేసి, పాప్‌ కార్న్‌కి బాగా పట్టించాలి. చివరిగా రెయిన్‌బో స్ప్రింకిల్స్‌ వేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

చదవండి: ఈ వాటర్‌ బాటిల్‌ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..


 

మరిన్ని వార్తలు