మనుషుల్లో తొందరగా వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణం ఇదే! వెలుగులోకి విస్తుపోయే విషయాలు

9 Nov, 2023 17:22 IST|Sakshi

మనుషుల్లో కొందరూ చాలా పెద్దాళ్లలా కనిపిస్తారు. తొందరగా వయసు పెరిగిపోయినట్లు వృద్ధాప్య ఛాయలే గాక ఆ వయసు సంబంధిత రుగ్మతలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా ఎందువల్ల జరుగుతుందో అనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లగానో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటివల్లే మనిషి వయసు స్పీడ్‌ అప్‌ అయ్యి వృద్ధులుగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది మనిషి దేహంలోనే ఉంటూ టైం చూసి వయసుపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. దేని వల్ల ఇలా జరుగుతుంది. ఏం చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం!.

పిల్లులు, ఎలుకల్లో ఉండే పరాన్నజీవులు(చిన్న బగ్‌) మనిషి వయసును ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూఎస్‌లోని దాదాపు 15% మంది వ్యక్తులు తమ జీవిత కాలంలో తెలిసి లేదా తెలియకుండానే వాటిలో ఉండే ఏక కణజీవి టోక్సోప్లాస్టో గోండి బారిన పడ్డట్లు తెలిపారు. ఇవి పిల్లుల, ఎలుకలు శరీరంలో ఉంటాయని. అవి మనిషి శరీరంలో చేరి నిద్రాణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది దాని జీవితకాలం మనిషి శరీరంలోనే జీవించగలదని చెబుతున్నారు. మనిషికి ఉండే రోగ నిరోధకవ్యవస్థ కారణంగా ఆ పరాన్న జీవి కలిగించే ఇన్ఫెక్షన్స్‌కి గురికావడం అనేది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది మన వయసును ప్రభావితం చేసి వృద్ధాప్య లక్షణాలు కనిపించేలా.. ఆ వయసులో ఉండే శారీరక బలహీనతలను వేగవంతం చేస్తోందన్నారు. దీన్ని వృద్ధాప్య సిండ్రోమ్‌ అని పిలుస్తారు. దీని కారణంగా వృద్ధుల మాదిరిగా బరువు తగ్గడం, అలసట, కొద్దిగా కూడా శారీరక శ్రమ చేయలేకపోవడం, బలహీనంగా ఉండటం, తరుచుగా ఆస్పత్రికి వెళ్లడం తదితర లక్షణాలన్నీ ఒక్కసారిగా తలెత్తుతాయన్నారు.

ఈ లక్షణాలు 65 ఏళ్లు అంతకంటే పైబడినవారిలో గుర్తించినట్లు తెలిపారు. వృద్ధుల్లో ఈ గోండి ఇన్ఫెక్షన్‌ కోసం వెతకగా ఇది సంకోచించి ఉండి, ముందుగానే వయసును ప్రభావితం చేసినట్లు గుర్తించామన్నారు. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు దాదాపు 601 మంది స్పానిష్‌, పోర్చుగ్రీస్‌ వృద్ధులపై పరిశోధనలు చేయగా 67% మంది ఈ గోండి పరాన్న జీవికి ప్రభావితం అయినట్లు గుర్తించారు. ఈ పరాన్న జీవి నిర్ధిష్ట ప్రతిరోధకాలు వయసును ప్రభావితం చేసి.. సంబంధిత బలహీనత లక్షణాలను పెంచుతున్నట్లు తెలిపారు. అందువల్ల  పిల్లి, ఎలుకలు వంటి జీవులకు వాటి వ్యర్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఒక వేళ్ల పెంపుడు జంతువులుగా పెంచుకున్నా.. సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  హెచ్చరిస్తున్నారు.

(చదవండి: భారత్‌లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక)

మరిన్ని వార్తలు