Ugadi 2023-Navagraha Sanchara Bhashyam: నవగహ్ర సంచార భాష్యాలు 2023– 24 జరుగబోవు సంఘటనలు, సామాజిక విషయాలు..

21 Mar, 2023 14:37 IST|Sakshi

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం వర్ధిల్లుతుంది.
జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దయ ప్రజలకు లభిస్తుంది. 
యాదాద్రి లక్ష‍్మీనరసింహ స్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. 
పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడతాయి.
అరబ్‌ దేశాలలో నిరసనలు. భారీ కుంభకోణాలు బయటపడతాయి. ప్రముఖుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. 

ఇండోనేషియా, చైనాలో భూకంపం వల్ల అపార నష్టం. 
విజిలెన్స్, ఈడీ, సీబీఐ దాడులు సంచలనాత్మక నేర సంబంధమైన విషయాలు బయటపెడతాయి. 
సముద్ర వాతావరణంలో చెడ్డ మార్పులు దెబ్బతీస్తాయి. (అరేబియా, బంగాళాఖాతం)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వనున్న బీజేపీ. 
కొన్ని రాష్ట్రాల మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటనున్న బీజేపీ

పాకిస్తాన్, చైనాలతో భారతదేశానికి సరిహద్దు వివాదాలు శ్రుతిమించి  రాగానపడతాయి, సరిహద్దులలో అప్రమత్తత, ఉద్రిక్తత వాతావరణం.
గ్రేటర్‌లో ప్రతి కొనుగోలు గోల్‌మాల్‌.
బిట్‌కాయిన్‌ భవిష్యత్తులో కొంపదీస్తుంది.
పెట్రోల్‌ ధరలకు సమానంగా ఉల్లి ధర, కొన్ని కూరగాయలు.
క్రీడాకారుల భద్రతా విషయంలో విశేషమైన జాగ్రత్తలు అవసరం.

తెలంగాణలో బలం పెంచుకోనున్న కమలం.
పెరిగిన రేట్ల వలన సామాన్య ప్రజలకు అగ్నిపరీక్షా కాలం.
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జలబీభత్సం, ఆర్థికనష్టం.
కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో పూర్తిగా బలహీనపడే సూచనలు ఉన్నాయి.
చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది.

జమ్మూ, కాశ్మీర్‌ల విషయంలో ప్రధాని సంచలనాత్మక నిర్ణయాలు.
ముప్పయి ఏళ్ళకే సైట్, స్పాండిలైటిస్‌. ఆరోగ్యం భాస్కరాదిత్యం అని గ్రహించండి.
గో హత్యల నిషేధం దిశగా చట్టాలు అమలు.
భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న అమిత్‌ షా.
ఆయుర్వేదం మందులు అధిక ధర కలిగి ఉంటాయి. ప్రజలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తారు.    

మమతా బెనర్జీ జాతకంలో మహారాజయోగం నడుస్తోంది. (2024)
పామాయిల్‌ సాగుబడి గిట్టుబాటు అవుతుంది.
విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తప్పని కష్టాలు.
చేతులెత్తనున్న ఒక పెద్ద ఫైనాన్స్‌ కంపెనీ, ప్రజల నెత్తిన శఠగోపం.
దేవాలయాలలో చోరీలు అధికం అవుతాయి.

సెల్‌ఫోన్‌ యువత పెడదోవ పట్టడానికి, నాశనానికి కారణం అవుతుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేదు అనుభవాలు.
వంట నూనెల ధరలు ఆకాశంలోకి వెళ్తాయి.
చేదెక్కనున్న పంచదార.    
అందరికీ సూర్యుడు ముఖ్యం (సోలార్‌ పవర్‌). 

2024వ సంవత్సరంలో రాజకీయాలలో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది. 
డ్రంకెన్‌  డైనోసర్స్‌ విజృంభిస్తారు.
నపట్టాలు ఉంటాయి కానీ భూములే ఉండవు.
కోడిగుడ్డు, మాంసం ధరలు అధికమవుతాయి. 
వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అధికం అవుతాయి.

ప్రతికూల గ్రహస్థితి వల్ల విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది.
హోమియోపతి వైద్యానికి అత్యంత ఆదరణ.
డ్రాగన్‌ కంట్రీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది.
మరింత అధికం గృహ సంబంధిత పన్నులు.
శ్రీలంక, టర్కీకి గడ్డుకాలం.

మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. (నూనె ధరలు పెరగడం దీనికి కారణం)    
నీట మునిగే కొన్ని ప్రాంతాలు.
ప్రకృతిలో అందం నశిస్తుంది. మనుషులలో జీవత్వం తగ్గిపోతుంది.
ఆహారం కాలుష్యం, ఆయువు క్షీణం.
దొంగతనాలు పెరుగుతాయి.

చిరుధాన్యాలు మంచి ధర కలిగి ఉంటాయి. పంట వేసిన వాడికి పంట పండుతుంది.
కొత్త రకాలైన ఆహారపు డైట్‌లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తాయి.
గో సంతతికి గడ్డుకాలం.         
ఇదివరకు తల్లిపాలు కొరత  ఇప్పుడు పిల్లల కొరత.
ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోనున్న నూతన జనాభా.
డయాబెటిస్, ఊబకాయం అధికమవుతాయి.

బ్రిటన్‌కి గడ్డుకాలం (గురువు గారు చెప్పిన దాంట్లో మార్పులేదు).
అనాథల సంఖ్య పెరుగుతుంది.
కొన్ని వ్యాపారాలు రాత్రికి రాత్రే మూతపడతాయి.
నఅంతరించిపోతున్న కళలకు గుర్తింపు, సహాయం లభిస్తుంది.
బంగారం దుకాణాలకు ఎక్కువ సెక్యూరిటీ అవసరం.
నఇదే పద్ధతిలో ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంటు.

ఉన్నత పదవులలో ఉన్నవారికి భద్రత మరింత అవసరం.
ఈత వస్తే సముద్రం పక్కన ఇల్లు కట్టుకోండి.
టమాటాలు, డ్రగ్స్‌ ఎక్కడైనా కొనుక్కోవచ్చు.
నసౌరశక్తి వ్యాపారాలు బాగుంటాయి.
అంగవైకల్యంతో ఉన్నవారికి శుభవార్త. 
మెడికల్‌ రంగంలో నూతన మార్పులు కలిసివస్తాయి.

అన్ని దేశాల జీడీపీ గణనీయంగా మారబోతుంది.
వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. శ్వాసకోస వ్యాధులకు మందులు దొరకవు
విమానం నడిపేవారికి దారి కనబడక గమ్యం మారుతుంది.
భూకంపాలు కనివిని ఎరుగని రీతిలో పెరుగుతాయి. నూతన ప్రదేశాలకు ఇవి వ్యాప్తి చెందుతాయి.    
నీటి కాలుష్యం పెరుగుతుంది.

ప్రకృతి బీభత్సాల వల్ల కలిగిన నష్టం అందరికీ సమానంగా అందుతుంది.
ఇవి బీద, బిక్కు, పేద, గొప్ప, అధికారి అన్నది లేకుండా పెద్ద దేశాలు, చిన్న దేశాలు అనేది లేకుండా బాధిస్తాయి.
బియ్యం, కందిపప్పు. మినపపప్పు దినుసులు సామాన్యుడికి దొరకడం కష్టం అవుతుంది.    
పేకముక్కలలాగా నేలకొరిగే కట్టడాలు.
రాగి, మట్టిపాత్రల ప్రాధాన్యత పెరుగుతుంది.

దంచికొట్టనున్న ఎండలు. ఇంట్లో ఉండలేము, బయటకు వెళ్ళలేము.
ఆర్గానిక్‌ పంటల ప్రాధాన్యం పెరుగుతుంది.
నిమ్మకాయల వాడకం పెరుగుతుంది (అధిక ధర కలిగి ఉంటాయి).
ఎలక్టాన్రిక్‌ వెహికిల్స్‌ వాడకం పెరుగుతుంది.
పురాణ కట్టడాలే కాదు నూతన కట్టడాలు కూలిపోతాయి.
► పెరిగిపోనున్న రేడియేషన్‌. అంతరించిపోనున్న మరికొన్ని పక్షులు.

జమ్ము కాశ్మీర్‌కు శుభవార్త, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో కాశ్మీర్‌.
కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, బ్యాంకులో భద్రంగా ఉన్నాయి (ఋణాలు)
గ్యాంబ్లింగ్‌లో కొత్త అధ్యాయాలు, పోలీసులకు చుక్కలు.
వృద్ధాశ్రమాలకు అడ్వాన్స్‌లు, డిపాజిట్‌లు.
పోపు లేకుండా పులిహోర ప్రసాదం.
బ్రిటన్‌ ప్రధానమంత్రికి గడ్డుకాలం.

అన్నింటికీ లోన్‌లు ఇచ్చే బ్యాంకులు  మధ్యాహ్న భోజనానికీ లోన్‌ ఇస్తాయి.
ఆఫ్రికా ఖండానికి ఆకలి బాధలు.
అగ్నిప్రమాదాల్లో అంతరించి పోనున్న జీవరాశులు.
రణరంగంగా మారనున్న భారతదేశం.
పాకిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం ఎక్కువ అవుతుంది.
యూరప్‌కు గడ్డుకాలం.
ధాన్యము కరువు వాటిల్లుతుంది.

ఇండియన్‌ మిలటరీ బలోపేతం  శత్రువులను భూస్థాపితం.
తీవ్రవాదుల చర్యలు విస్తరిస్తాయి.
అగ్రరాజ్యం అమెరికా చీకటిమయం.
నార్త్‌ కొరియా వార్తల్లో ఉంటుంది.
ప్రపంచ దేశాలన్నింటినీ వణికించనున్న యుద్ధభయం. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం మొదలు పెడతారో, బాంబులు పడతాయో అనే భయంతో, ఆందోళనలో ప్రజలు.
ఓల్డేజ్‌ హోవ్‌ులో సౌకర్యాలు పెరుగుతాయి. శేషజీవితం గడపడానికి అనువైన ప్రదేశం.

అకాల వర్షాలు ఈసారి కూడా రైతులపట్ల జాలి చూపవు. పంట నష్టం తప్పకపోవచ్చు.
హైదరాబాద్‌ చుట్టూ భారీగా పెరగనున్న భూముల ధరలు.
బ్యాంక్‌ రుణాల వడ్డీలు, యూజర్‌ చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి.
మెన్స్‌ క్రికెట్‌కే కాదు ఉమెన్స్‌ క్రికెట్‌కి కూడా అభిమానుల ఆదరణ పెరుగుతుంది.
సైబర్‌ నేరాలు అధికమవుతాయి.
కారు కొనుక్కోవడానికి బతిమాలి అప్పు ఇస్తారు  బియ్యం కొనుక్కోవడానికి బిచ్చం కూడా కష్టం.
ప్రత్తి పంటకు సువర్ణకాలం.

భవిష్యత్‌కు బంగారు బాట నీటి వ్యాపారం.
ప్రజలలో తగ్గిపోనున్న రోగనిరోధక శక్తి.
అనేక రైలు వంతెనలకు, బ్రిడ్జిలకు నూరేళ్ళు నిండాయి.
గడ్డి దొరకని గడ్డుకాలము మూగ జీవుల పట్ల కాఠిన్యం వహించిన దైవం.
పేలుళ్లు, అగ్నిపర్వతముల ప్రకంపనలు నిత్య దీపావళితో సమానం.
క్రీడా, వైద్యరంగంలో భారత్‌కు ప్రపంచ ప్రఖ్యాతి.
మన దేశ సహాయ సహకారాలు చాలా దేశాలకు అవసరం అవుతాయి.
సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానం.

ఫిబ్రవరి నుండే మనకు ఎండాకాలం ప్రారంభం.
ఉక్కు, స్టీలు పరిశ్రమలకు అనుకూల కాలం.
భయం నీడలో మానవుడు  భద్రత లేని జీవితాలు.
చెట్ల పెంపకం అధికమవుతుంది.
రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ కన్నా, ఉక్రెయిన్‌ను సమర్థిస్తున్న దేశాలకే ఎక్కువ ప్రమాదం, నష్టం వాటిల్లుతుంది.
పాకిస్తాన్‌కు తాలిబాన్లతో, ప్రకృతితో ఇబ్బందులు ఏర్పడుతాయి.తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. కోలుకోలేని విధంగా పాకిస్తాన్‌ ననష్టపోతుంది.

టర్కీ, జపాన్, ఇండోనేషియాలో భూకంపాల పరంపర కొనసాగుతుంది.
చైనా భవిష్యత్తు బట్టబయలవుతుంది. వేసుకున్న ప్రణాళికలు బయటపడతాయి.
వైద్యుల పంట పండించనున్న మధుమేహ రోగులు.
యుద్ధం సంభవిస్తే జ్యోతిష ఫలితాలలో మార్పులు వస్తాయి.
ఏ వ్యక్తి జాతకంలోనూ ఆయుఃప్రమాణం పరిశీలించలేదు.
చదవండి: శ్రీ శోభకృత్‌నామ సంవత్సర పండుగల జాబితా ఇదే

మరిన్ని వార్తలు