భాంజా ఒవైసీ.. మూము కేసీఆర్‌!

9 Nov, 2023 07:33 IST|Sakshi

మేరే భారే మే జల్దీ మాముకు బోల్‌ దేరేం.. కుచ్‌ బీ నహీ హువా తోబీ మాముకు బోల్‌ రేం..(నేను ఏది చేసినా.. ఏది చేయకపోయినా.. కొంత మంది వెంటనే మామకు చెప్పేస్తున్నారు) అంటూ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. ఆయన అంటున్నట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం సీఎం కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీలను మామా అల్లుళ్లు అంటూ సంబోధిస్తున్నారు.

నాంపల్లి బహిరంగ సభలో రాజేంద్ర నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. అబ్‌ దేఖో మాముకు బీ గుస్సా ఆతా (మామకు కూడా కోపం వస్తుంది) అంటూ నవ్వుతూ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. ఇక మలక్‌పేట్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ కార్పొరేటర్‌ ముజఫర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ముస్లింలందరినీ భాంజా ఒవైసీ (అల్లుడు.. ఒవైసీ) మూము (కేసీఆర్‌)కు దేదియే క్యా అంటూ మామా అల్లుళ్ల బంధాన్ని వివరించారు. – చార్మినార్‌

మరిన్ని వార్తలు