ఆ రెండింటిపై వ్యూహమేంటి?

9 Nov, 2023 07:31 IST|Sakshi

హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్‌ పార్టీ ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? గెలుపు కోసమా? మిత్ర పక్షమైన బీఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చేందుకా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలైన జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ స్థానాల్లో ఎన్నికల బరిలో దిగింది. జూబ్లీహిల్స్‌ స్థానానికి షేక్‌పేట కార్పొరేటర్‌ మహ్మద్‌ రషీద్‌, రాజేంద్రనగర్‌ స్థానానికి లంగర్‌హౌజ్‌ మాజీ కార్పొరేటర్‌ బి.రవియాదవ్‌ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.

రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత మజ్లిస్‌ వ్యూహంపై ముస్లిం మేధావి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పక్షాన మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ ఎన్నికల బరిలో దిగారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్‌ అభ్యర్థి రంగంలోకి దింపిన కారణంగా మైనారిటీ ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పరోక్షంగా అధికార బీఆర్‌ఎస్‌ కాని బీజేపీ కాని లాభపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు