కళలకు పట్టం కట్టాలి...

16 Nov, 2023 06:27 IST|Sakshi

హైదరాబాద్: నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దేశంలోనే చాలా విషయాల్లో మన సిటీ ముందంజలో ఉంది. ఏ నగరం అయినా ఎంతగా డెవలప్‌ అవుతున్నా... కొన్ని కొన్ని అంశాల్లో లోటు కనపడుతూనే ఉంటుంది. అలా చెప్పాలంటే ఈ సిటీలో ముఖ్యంగా కళలకు, కళాకారులకు మరింత చోటు కల్పించాలి. ఇప్పటికే ఇది సినీ రాజధానిగా ఉంది.

అలాగే థియేటర్‌ ఆర్ట్స్‌కి కూడా పెద్దపీట వేయాలి. ఆడిటోరియమ్స్‌, అకాడమీలకు ప్రోత్సాహంతో పాటు ఆర్టిస్ట్స్‌కి శిక్షణ, కెరీర్‌ కూడా నగరంలోనే లభించేలా చూడగలిగితే నగరాభివృద్ధి ‘కళ కళ’లాడుతుంది. దక్షిణాదిలో చైన్నె, ఉత్తరాదిలో ముంబై నగరాలను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. అదే విధంగా నగరంలో మరింత పచ్చదనం, పరిశుభ్రత అవసరం. అవసరమైతే పారిశుధ్యం విషయంలో భారీ జరిమానాలు విధించి అయినా పూర్తి పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు అందుకోవాలి. – అర్చన, సినీనటి

మరిన్ని వార్తలు