బతుకుదెరువు కోసం వెళ్లి మృత్యుఒడికి.. 77 మంది జలసమాధి

24 Sep, 2022 14:50 IST|Sakshi

బతుకుదెరువు కోసం వలసవెళ్లిన 77 మంది బోటు ప్రమాదంలో దుర్మరణం చెందారు. లెబనాన్‌ నుంచి యూరప్ వెళ్లే క్రమంలో సిరియా తీరంలో పడవ మునిగి ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బోటులో మొత్తం 150 ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సిరియా సహాయక బృందాలు రంగంలోకి దిగి సముద్రంలో మునిగిన వారిని కాపాడారు. ప్రస్తుతం 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది లెబనీస్ పౌరులే ఉన్నారు.

సిరియా  పోర్టు నగరం టార్టస్ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇంతటి విషాద ఘటన ఇటీవలి కాలంలో చోటుచేసుకోలేదని సిరియా అధికారులు పేర్కొన్నారు. అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చాలా మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్‌లో ప్రజలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బులేక, పనిచేయడానికి ఉపాధి దొరకక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పడవల్లో సముద్ర మార్గం ద్వారా ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. చిన్నసైజు బోట్‌లలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల అవి మునిగిపోయి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.
చదవండి: చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి

మరిన్ని వార్తలు