బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం

10 Feb, 2022 09:57 IST|Sakshi

Bored Security Guard Drew Eyes On Painting of Faceless Figures: కొంతమంది సరదాగానో లేక బోరుకొడుతుందనో చేసిన పనులు వికటించి పెను ప్రమాదాలుగా మారిని సందర్భాలు కోకొల్లలు. ఐతే అవి ఒక్కోసారి మనకు నష్టం వాటిల్లకపోయిన లక్‌ని తీసుకువచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఒక్కోసారి ఆ పనులు మనం కలలో కూడా ఊహించనంత నష్టాన్ని చవిచూసేలా చేస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే రష్యాలో చోటుచేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...1932-1934 నాటి త్రీ ఫిగర్స్‌ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్‌ సెంటర్‌లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్‌ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్‌ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్‌ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. 

ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన  వేశారు. అయితే ఈ పేయింటింగ్‌ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ. 7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్‌ కంపెనీ ఆ పేయింటింగ్‌ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు కూడా.

(చదవండి: వెన్నుముక మార్పిడి..వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..)

మరిన్ని వార్తలు