పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!

24 Dec, 2021 15:53 IST|Sakshi

Special Loans To Urge Couples To Have Babies: చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాదు దాదాపు రూ.23 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే కొంతమంది జనాభా శాస్త్రవేత్తలు జిలిన్‌ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చని అంచనా వేశారు.

(చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్‌ కాల్స్‌!)

దీంతో జిలిన్‌ ప్రావిన్స్‌ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. అంతేకాదు ఆ చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి జంటలు నివాసం పొందేందుకు అనుమతిచ్చింది. అయితే ఇలా అనుమతి పొందడాన్ని అక్కడ హుకౌ అని పిలుస్తారు. పైగా వారికి పిల్లలు ఉంటే వారు పబ్లిక్‌ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది. 

అయితే జిలిన్ ప్రావిన్స్‌ చైనా"రస్ట్ బెల్ట్" ప్రాంతంలోని భాగం. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రావిన్స్‌ గత కొన్ని సంవత్సరాలుగా అధ్వానమైన జనాభా క్షీణత, ఆర్థికవృద్ధిలో మందగమనాన్ని చవి చూసింది. అంతేకాదు ఇతర ప్రావిన్సుల మాదిరిగానే, జిలిన్ కూడా ప్రసూతి, పితృత్వ సెలవులను పొడిగించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలను ప్రోత్సహించడంపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకి తెలిపింది.

(చదవండి: చైనా సైబర్‌స్పేస్‌ చివరి యుద్ధం!...ఇంటర్నెట్‌ క్లీన్ అప్!!)

మరిన్ని వార్తలు